కార్య‌క‌ర్త‌లే పార్టీకి ప‌ట్టుకొమ్మ‌లు

ఒంగోలు: కార్య‌క‌ర్త‌లే పార్టీకి ప‌ట్టుకొమ్మ‌ల‌ని, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్ర‌కాశం జిల్లాలో ప‌టిష్ట ప‌రిచేందుకు నిర్విరామంగా కృషి చేయాల‌ని పార్టీ జిల్లా అధ్య‌క్షుడు బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి అన్నారు. ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశాన్ని బాలినేని శ్రీ‌నివాస్  ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా భారీ ర్యాలీ ఏర్పాటు చేసి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు బాలినేనికి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సీఎం చేసుకోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే రాష్ట్రంలో రాజ‌న్న పాల‌న మ‌ళ్లీ తిరిగొస్తుంద‌న్నారు. అనంత‌రం ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న బాలినేనిని ఒంగోలు నగర అధ్యక్షలు మరియు రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షలు కుప్పం ప్రసాద్, ముస్లిమ్ మైనార్టీ నాయకులు సుభాని. యూత్ నాయకులు అమర్నాధ్ రెడ్డిలు ఘ‌నంగా స‌త్క‌రించారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. 
Back to Top