అచ్చెన్నాయుడిపై చర్యలు తీసుకోవాలి

హైదరాబాద్ః స్పీకర్ తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అవిశ్వాసంపై చర్చలో సందర్భంగా స్పీకర్ ప్రతిపక్షం గొంతునొక్కడాన్ని, అధికారపక్షం సభ్యులు ప్రతిపక్ష నేతను పరుష పదజాలంతో దూషించడాన్నినిరసిస్తూ...వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ...ప్రతిపక్ష సభ్యులు పోడియం ముందు బైఠాయించారు.

Back to Top