టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి

విజయవాడ : ఓ మహిళను లైంగికంగా వేధించిన కేసులో అధికార టీడీపీకి చెందిన కాల్మనీ సెక్స్ రాకెట్  వ్యాపారి మండవ రవికాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులకు మద్దతుగా మహిళా సంఘాలు కృష్ణలంకలోని రవికాంత్ ఇంటి వద్ద ధర్నా చేశారు. రవికాంత్ కాల్మనీ సెక్స్ రాకెట్  పేరుతో మహిళలను తీవ్ర వేధింపులకు గురిచేశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  10 మంది మహిళలను రూ. కోటి వరకు మోసం చేశాడని ఆయా సంఘాలు ఆరోపించాయి. రవికాంత్కు అండగా ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను డిమాండ్ చేశారు.

Back to Top