కరవు మీద ఉద్యమ కార్యాచరణ

హైదరాబాద్) కరవు సహా
రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యల మీద ఉద్యమాన్ని నిర్మించేందుకు వైఎస్సార్సీపీ
సమాయత్తం అవుతోంది. ఈ మేరకు ఈ నెల 19న పార్టీలో నాయకులతో సమావేశం ఏర్పాటు
చేసుకొన్నట్లు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వెల్లడించారు. హైదరాబాద్
లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమస్యలు తీర్చకుండా
ప్రభుత్వం... ప్రజల ద్రష్టిని పక్కకు మళ్లించే పనులు చేపడుతోందని ఆయన వివరించారు.
ఇందుకు నిరసనగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు.
దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ఈ నెల 19 న ఖరారు అవుతుందని అంబటి
వివరించారు.

          

Back to Top