కరువు, ప్రజల అవసరాల మీద ఉద్యమ కార్యాచరణ

హైదరాబాద్) కరువు, తాగునీటి ఎద్దడి, రైతాంగ సమస్యల మీద వైఎస్సార్సీపీ ఉద్యమ
కార్యాచరణ ను ఖరారు చేసింది. పార్టీ జిల్లా శాఖల అధ్యక్షులు, పరిశీలకులతో
అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ భేటీలో కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తొక్కి, అవినీతి
సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న వైఖరికి నిరసనగా ఈ నెల 25న సేవ్
డెమక్రసీ పేరుతో జిల్లా కేంద్రాల దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన చేయనున్నారు. తర్వాత ఇదే
అంశం మీద పార్టీ నాయకులు అధ్యక్షులు వైఎస్ జగన్ నాయకత్వంలో ఢిల్లీకి
వెళ్లనున్నారు. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు.

వచ్చే నెల ఐదున అన్ని మండల కేంద్రాల్లో తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఖాళీ
బిందెలతో ప్రదర్శన చేయనున్నారు. కరువు, తాగునీటి ఎద్దడి మీద ప్రభుత్వ వైఫల్యాలకు
నిరసనగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. 

Back to Top