సంస్థాగ‌త నిర్మాణానికి చ‌ర్య‌లు


వైయ‌స్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు గ‌ట్టు శ్రీ‌కాంత్‌రెడ్డి
హైద‌రాబాద్‌:  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీని తెలంగాణ‌లో బ‌లోపేతం చేసే దిశ‌గా సంస్థాగ‌త నిర్మాణానికి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు గ‌ట్టు శ్రీ‌కాంత్ రెడ్డి అన్నారు. హైద‌రాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో శ‌నివారం విస్తృత‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ... వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సూచ‌న‌ల మేర‌కు రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతానికి కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తున్నామ‌న్నారు. న‌ల్గొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, రంగారెడ్డి జిల్లాల అధ్య‌క్షులు, పార్టీ సంబంధిత విభాగాల అధ్య‌క్షుల‌తో స‌మావేశం నిర్వ‌హించామ‌ని తెలిపారు. 
Back to Top