జూన్ 2న నియోజక వర్గాల్లో కార్యాచరణ – మాజీ మంత్రి బొత్సా


హైదరాబాద్) చంద్రబాబు
ప్రభుత్వ వైఖరి, మోసాలకు నిరసనగా వచ్చే నెల 2న అంటే, వచ్చే గురువారం నాడు అన్ని
నియోజక వర్గాల్లో కార్యాచరణ  నిర్వహించనున్నట్లు మాజీమంత్రి, వైయస్సార్సీపీ
సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ వెల్లడించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ
కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీమంత్రి దర్మాన ప్రసాద్ రావు,
ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. మహానాడు తీరు చూస్తుంటే ఆత్మస్తుతి, పరనింద తప్ప
ఏమీ కనిపించడం లేదు. జగన్, వైయస్సార్సీపీ మీద దాడి చేయడం ఈరెండే ప్రధాన అంశాలుగా ఉన్నాయని బొత్స అభిప్రాయ పడ్డారు.    మోసం చేస్తున్న
బాబులాంటి వ్యక్తుల్ని ....ప్రజాస్వామ్యంలో ఎక్కడ చూడలేదు. ఇటువంటి వారిపై  చర్యలు
తీసుకోవాలని కోరుతూ జూన్ 2న అన్ని నియోజకవర్గకేంద్రాల్లో కార్యాచరణ తలపెట్టినట్లు ఆయన వెల్లడించారు.  పంచభూతాల్ని తినేస్తున్నారని, ఇసుక,  మట్టి ఇలా  కనిపించిందల్లా దోచేస్తున్నారని బొత్సా మండిపడ్డారు.  రూపాయి లంచం లేకుడా
ఎక్కడైనా పనిజరుగుతుందా అని ఆయన
ప్రశ్నించారు.     

Back to Top