అవినీతి సొమ్ముతో అడ్డంగా బలిసిన అచ్చెన్నాయుడు

  • అచ్చెన్నాయుడు మెదడు తక్కువ వ్యక్తి
  • వైయస్‌ఆర్‌ సీపీ జెండా దిమ్మెను కూల్చడం అప్రజాస్వామ్యం
  • రాత్రికి రాత్రే రౌడీల్లా టీడీపీ దిమ్మె నిర్మాణం
  • అడ్డొచ్చిన మహిళా అధికారిని భూతులు తిట్టిన టీడీపీ నేతలు
  • మంత్రి అచ్చెన్నాయుడిని వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్
  • వైయస్‌ఆర్‌ సీపీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి
విజయవాడ: అడ్డంగా, నిలువుగా పెరిగి మెదడు తక్కువ వ్యక్తిగా పేరొందిన అచ్చెన్నాయుడు కార్మిక శాఖామంత్రిగా పనిచేస్తుండడం ఏపీ ప్రజల దురదృష్టమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి విమర్శించారు. అచ్చెన్నాయుడు కార్మిక శాఖలో వందల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. విజయవాడ వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. అధికార అహంతో అచ్చెన్నాయుడు విజయవాడలో రౌడీయిజానికి పాల్పడుతున్నారని, తన అనుచరులతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా దిమ్మెను కూల్చేయించారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, లంచాలతో ముడిపెట్టుకొని చంద్రబాబు చేస్తున్న పరిపాలన చూస్తుంటే ఆలీబాబా 40 దొంగల కథ గుర్తుకు వస్తుందన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి చంద్రబాబు 40 మంది దొంగలను వదిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఐటీఐ విద్యార్థులకు సంబంధించిన పీజుల విషయంలో వందల కోట్లు మంత్రి అచ్చెన్నాయుడు జేబులోకి వెళ్లాయన్నారు. రూ. 7,500 ఉన్న ఫీజును ఏకంగా రూ. 16,500లకు పెంచారని దుయ్యబట్టారు. కార్మిక శాఖ పరికరాల కొనుగోలు విషయంలో కూడా రూ. 300 కోట్లు వెచ్చిస్తే రూ. 120 కోట్లు మంత్రి తన ఖాతాలో వేసుకున్నాడని ఆరోపించారు. ఈ విషయాలన్నీ విజిలెన్స్‌ అధికారుల దాడులలో వెలువడ్డాయని చెప్పారు. అచ్చెన్నాయుడు ఇంత దారుణంగా అవినీతికి పాల్పడుతున్నా చంద్రబాబు మాత్రం అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం టీడీపీకి లేదు
కార్మికశాఖామంత్రి అచ్చెన్నాయుడు విచ్చల విడిగా అవినీతికి పాల్పడుతున్న చంద్రబాబు ఉందుకు చర్యలు తీసుకోవడం లేదని గౌతమ్‌రెడ్డి ప్రశ్నించారు. మహిళల వేధింపులు, హత్య కేసులు ఉన్న వ్యక్తిని మంత్రివర్గంలో ఎలా కొనసాగిస్తారని చంద్రబాబును ప్రశ్నించారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అచ్చెన్నాయుడిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మిక శాఖలో ఉండి కార్మికుల రక్తాన్ని పీల్చే మంత్రిగా తయారయ్యాడని దుయ్యబట్టారు. విజయవాడలో వైయస్‌ఆర్‌ సీపీ ట్రైడ్‌ యూనియన్‌ జెండాలుంటే వాటిని అన్యాయంగా తొలగించి రోడ్డుకు అడ్డంగా టీడీపీ జెండాలను ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ చర్యను అడ్డుకున్న పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌ను అన్యాయంగా అరెస్టు చేసి 50 కిలోమీటర్లు దూరంలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కోవడానికి దమ్మూ, ధైర్యం లేక పోలీసులను అడ్డం పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాన్ని అణచివేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

Back to Top