మా రాజీనామాలు ఆమోదించండి

ప్రకాశం: ప్రత్యేక హోదా సాధనకు ఎంపీ పదవులకు చేసిన రాజీనామాలను ఆమోదించాలన్నదే మా నినాదమని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.  రాజీనామాలు ఆమోదించండి..లేదా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండు చేశారు. రేపు (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు లోక్‌సభ స్పీకర్‌ను కలుస్తామని ఆయన చెప్పారు. రాజీనామా చేసిన ఐదుగురు ఎంపీలంతా స్పీకర్‌ను కలుస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ రాజీనామాలను ఆమోదించకపోతే రాష్ట్ర ప్రజలను అవమానించినట్లే అన్నారు.  ఉప ఎన్నికలకు తాముసిద్ధమే అని ఆయన వెల్లడించారు. వైయస్‌ఆర్‌సీపీని గెలిపించేందుకు ప్రజలు మానసికంగా సిద్ధమయ్యారన్నారు. వెలిగొండ ప్రాజెక్టులో రూ. కోట్లను కమీషన్‌ రూపంలో బాబు దండుకున్నారని విమర్శించారు. డిసెంబర్‌ నాటికి వెలిగొండను పూర్తి చేస్తామన్న చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. వెలిగొండ ప్రాజెక్టును జాప్యం చేస్తూ ..జిల్లా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ త్వరలో జిల్లాలో పాదయాత్ర చేస్తానని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. 
Back to Top