అభ్యర్థుల వయోపరిమితి పెంచాలి

హైదరాబాద్ 03 మే 2013:

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చేపట్టే నియామకాలలో అభ్యర్థుల వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 39 ఏళ్లకు పెంచాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి ఈ మేరకు డిమాండ్ చేశారు. లెక్చరర్ల నియామకాల్లోనూ, డీయస్‌సీ నియామకాల వయోపరిమితినే పాటించాలని బాలినేని సూచించారు. యూపీ, కేరళ, బెంగాల్‌ రాష్ట్రాలలో అన్ని నియామకాల్లో వయోపరిమితి 40 ఏళ్లుగా ఉందనీ,..యూపీపీఎస్‌సీ తరహాలో ప్రతి ఏడాది ఏపీపీఎస్‌సీ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. వెలువరించే పలు ప్రకటనల్లో తీవ్ర జాప్యం కూడా చోటుచేసుకుంటోందన్నారు. దీనివల్ల విద్యావంతులైన యువతీయువకుల అవకాశాలు చేజారుతున్నాయని  నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బేషజాలకు పోకుండా వయోపరిమితి పెంచాలని బాలినేని,  భూమన కోరారు.

Back to Top