అభివృద్ధి చేశానని చెప్పడానికి సిగ్గుపడాలి : ఎమ్మెల్యే ఆర్కే రోజా

నంద్యాల: రాయలసీమను నేనే అభివృద్ధి చేశానని చంద్రబాబు మాట్లాడడం కంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. నంద్యాల 38వ వార్డులోని వైయస్‌ఆర్‌ నగర్, నందమూరినగర్‌లలో రోజా రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాయలసీమకు ప్రాజెక్టులు కడితేనే తాగు, సాగునీరు అందివ్వగలమని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి యుద్ధ ప్రతిపాదికన ప్రాజెక్టులు కట్టారన్నారు. కానీ చంద్రబాబు మూడున్నరేళ్లు గడుస్తున్నా గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగుగంగా ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయారన్నారు. కనీసం గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేసినా రైతులకు నీరు అందే పరిస్థితి ఉన్నా.. అవివే చంద్రబాబు చేయలేకపోయాడన్నారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని, 13 ఏళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేకపోయినందుకు సిగ్గుపడాలన్నారు. వైయస్‌ఆర్‌ పాలించిన 5 ఏళ్లలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందని ప్రజలందరికీ తెలుసన్నారు. చంద్రబాబు మూడున్నరేళ్ల పరిపాలనలో రుణమాఫీ లేదు, పేదలకు ఇల్లు కూడా కట్టించలేకపోయాడన్నారు. కర్నూలును స్మార్ట్‌ సిటీగా మారుస్తానని ప్రజలందరినీ స్మార్ట్‌గా మోసం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు గుణపాఠం చెప్పేందుకు నంద్యాలలో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థిని అత్యథిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 

Back to Top