అబ్దుల్ క‌లాం ఒక స్ఫూర్తి దాత‌

మాజీ రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లాం వృత్తి రీత్యా శాస్త్ర‌వేత్త
అయిన‌ప్ప‌టికీ, స్పూర్తిదాయ‌క‌మైన బోధ‌కుడిగా ప్రసిద్ది పొందారు. జీవితంలో
క‌డ‌ప‌టి క్ష‌ణాల్ని కూడా విద్యార్థుల‌కు విజ్ఞానం పంచుతూ గ‌డిపారు. ఆయ‌న
ఇచ్చిన సూక్తులు చాలా ప్రాచుర్యం పొందాయి. వాటిలోని కొన్ని మేలి ముత్యాలు..
1.
యువ‌త‌కు.. విభిన్నంగా ఆలోచించేందుకు, కొత్త విష‌యాలు క‌నుగొనేందుకు,
న‌వీన మార్గంలో ప్ర‌యాణించేందుకు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసుంద‌కు,
స‌మ‌స్య‌ల్ని అధిగ‌మించేందుకు కావ‌ల‌సిన ధైర్యాన్ని క‌లిగి ఉండాలి. ఈ
నైపుణ్యాల‌తో యువ‌త పురోగ‌మించాలి.

2.
నాయ‌క‌త్వంపై.. నాయకుడిని ఇలా నిర్వ‌చిస్తాను. నాయ‌కుడికి కచ్చితంగా
విజ‌న్‌, అబిరుచి ఉండాలి. స‌మ‌స్య‌ల నుంచి పారిపోయే గుణం ఉండ‌రాదు. దానికి
బ‌దులు దాన్ని ఎలా అధిగ‌మించాలి అనే త‌ప‌న ఉండాలి. స‌మ‌గ్రంగా పని చేయ‌టం
అంత‌కు మించి ముఖ్యం.

3. మ‌తం..స్నేహితుల‌తో క‌లిసి మార్గం ఏర్పాటు చేసుకొనేందుకు గొప్ప‌వారికి అవ‌కాశం. సామాన్యుల‌కు మాత్రం అది ఒక పోరాట మార్గం.

4.
అవినీతి మీద‌... అవినీతి ర‌హిత స‌మాజాన్ని నిర్మించాల‌న్నా, అద్బుత
ఆలోచ‌న‌లు గ‌ల జాతిని తీర్చిదిద్దాల‌న్నా అది ముగ్గురితో సాధ్యం. అది
తండ్రి, త‌ల్లి, మ‌రియు గురువు.

5. శాస్త్రీయ
పురోగ‌తి.. ప్ర‌స్తుత కాలంలో శాస్త్రీయ పురోగ‌తి ని తెలుసుకోవాలంటే
ఇంగ్లీషు త‌ప్ప‌నిస‌రి. రెండు ద‌శాబ్దాల త‌ర్వాత ఈ విజ్ఞాన‌మంతా మ‌న
స్థానిక భాష‌ల్లోకి వ‌స్తుంది. అప్పుడు మ‌నం జ‌ప‌నీయుల మాదిరి
పురోగ‌మించ‌వ‌చ్చు.

6. ప్ర‌తిరోధ‌క‌ముల మీద .. క‌ష్టాలు మ‌నిషికి అవ‌స‌రం. అప్పుడే వాటిని అధిగ‌మించిన ఆనందాన్ని ఆస్వాదించ‌వ‌చ్చు.

7. విద్యార్థుల మీద‌... ప్ర‌శ్నించ‌టం అన్న‌ది విద్యార్ధుల‌కు త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. వాళ్ల‌ను అలా అడ‌గ‌నివ్వాలి.

8. స్వాతంత్ర్యం మీద‌.. మ‌న‌కు స్వాతంత్ర్యం లేక‌పోతే, ఏ ఒక్క‌రూ మ‌న‌ల్ని గౌర‌వించ‌రు. 

9. క‌విత్వం మీద‌.. అత్యున్న‌త స్థాయి ఆనందం నుంచి కానీ, అగాధం వంటి విషాదం నుంచి కానీ క‌విత్వం పుడుతుంది.

10.
పిల్ల‌ల మీద‌.. ఒంటరిగా పిల్ల‌లు చ‌దువుకొంటుంటే, చుట్టు ఉన్న ప్రపంచం
అంతా వాళ్ల‌ను అందరిలాగే త‌యార‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తుంది.

11.
సైన్స్ మీద‌.. సైన్స్ అన్న‌ది విశ్వ‌వ్యాప్తం. ఐన్ స్టీన్ సిద్దాంతం
అందరికీ అందాల్సిందే. మాన‌వ‌జాతి కి ఇది ఒక చ‌క్క‌టి కానుక‌. దీన్ని
విచ్చిన్నం చేయ‌రాదు. అనేక జాతుల్ని సైన్స్ సాయంతో వేరు చేయ‌టం త‌గదు.

12. జీవితం మీద‌... జీవితం అన్న‌ది ఒక ఆట‌. వ్య‌క్తిగా నిన్ను నీవు నిరూపించుకొంటేనే అందులో నీవు విజ‌యం సాధిస్తావు.

13.
మ‌ర‌ణ శిక్ష మీద‌...  కోర్టులు విధించిన మ‌ర‌ణ‌శిక్ష మీద నిర్ణ‌యం
తీసుకోవ‌టం అన్న‌ది రాష్ట్ర‌ప‌తిగా నేను అనుభ‌వించిన  క‌ష్ట‌త‌ర
బాధ్య‌త‌ల్లో ఒక‌టి. ఆశ్చ‌ర్యం ఏమిటంటే.. దాదాపు అన్ని కేసుల్లో కూడా
సామాజిక ఆర్థిక కోణం కనిపించింది. నేరంలో బ‌య‌ట‌కు క‌నిపించిన వ్య‌క్తిని
శిక్షించ‌టం స‌రే, మ‌రి నేరానికి మూలంగా నిలిచిన వ్య‌క్తి సంగ‌తి ఏమిటి..!

14. క‌ల‌ల మీద‌.. క‌లలు.. క‌ల‌లు.. క‌ల‌లు క‌నండి. ఆ క‌ల‌లే ఆలోచ‌న‌లుగా మార‌తాయి. ఆ ఆలోచ‌న‌లే ఫ‌లితాల్ని అందిస్తాయి.

15.
అందం మీద‌.. నేను అందంగా లేను. కానీ ఇత‌రుల‌కు సాయం అందించేందుకు నేను
సిద్దంగా ఉంటాను. అందం అన్న‌ది మాన‌సిక‌మైన‌ది, శారీర‌క‌మైన‌ది కాదు.
Back to Top