వైయస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపిన అబ్బు చేరిక

అపనర్తి: రంగంపేట మండలం మర్రిపూడికి చెందిన రిమ్మలపూడి వెంకటేశ్వరరావు(అబ్బు) వైయస్సార్‌సీపీలో చేరడం నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని వైఎస్సార్‌సీపీ అనపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. వైయస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల నియమితులైన అబ్బును ఆదివారం అనపర్తిలో జరిగిన నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ అబ్బు స్ఫూర్తితో ఎంతోమంది పార్టీలో చేరి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేశారని అన్నారు. పార్టీలో చేరిన నాటినుండి నేటి వరకు రంగంపేట మండలంలో పార్టీ పటిష్టతకు ఆయన ఎనలేని కృషి చేస్తున్నారని ప్రశంసించారు. అబ్బు వెంట తరలి వచ్చే పార్టీ శ్రేణులు, ప్రజలే ఆయనకు గల ప్రజాభిమానాన్ని సూచిస్తున్నాయని, అంతటి సమర్ధత కలిగిన అబ్బును వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులు కావటం సమర్ధతకు పట్టాభిషేకంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా అబ్బును పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్లీనరీలో చేసిన తీర్మానాన్ని నాయకులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

Back to Top