అబద్ధాల్లో వరల్డ్ లోనే నెం.1..!

గుంటూరుః అబద్ధాల పోటీ పెడితే ప్రపంచంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటి స్థానంలో ఉంటాడని వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మీ పార్వతి అన్నారు. ఆయన అబద్ధాల్లో గిన్నీస్ బుక్లో కూడా ఎక్కుతాడని విమర్శించారు. ఆంధప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద నిరవధిక నిరాహార దీక్ష బుధవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. దీక్ష రెండో రోజుకు చేరిన సందర్భంగా అక్కడికి వచ్చిన లక్ష్మీ పార్వతీ మీడియాతో మాట్లాడారు.

వైఎస్ జగన్ దీక్షకు అనూహ్యమద్దతు వస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమాలకు అక్రమంగా కోట్లు ఖర్చుపెట్టి వాహనాలు ఏర్పాటు చేస్తున్నా వచ్చేందుకు ఆసక్తి చూపని జనం.. వైఎస్ జగన్ దీక్షకు మాత్రం భారీ సంఖ్యలో తరలి వస్తున్నారని చెప్పారు.  వైఎస్ జగన్ చేస్తున్న దీక్ష ప్రజలకే కాకుండా రైతులకు ఓ ధైర్యం అని చెప్పారు.మరోవైపు, గుంటూరు జిల్లా బార్ అసోసియేషన్ వైఎస్ జగన్ దీక్షకు మద్దతు తెలిపింది. భారీ సంఖ్యలో న్యాయవాదులు దీక్ష ప్రాంగణానికి చేరి వైఎస్ జగన్కు సంఘీభావం తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top