ఆటోనగర్ నుంచి షర్మిల పాదయాత్ర

ఖమ్మం, 26ఏప్రిల్2013:

ఆటోనగర్ నుంచి శుక్రవారం ఉదయం శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా నుంచి ఖమ్మం జిల్లాలో ప్రవేశించిన సంగతి తెలిసిదే. ఆటోనగర్ నుంచి మున్నేరు వంతెన, కాల్వ ఒడ్డు, పీఎస్సార్‌ రోడ్డు, గ్రెయిన్‌ మార్కెట్‌, చర్చి కాంపౌండ్‌, ప్రభ టాకీస్‌, రామాలయం మీదుగా పాదయాత్ర సాగుతుంది. తర్వాత కస్ప బజార్‌, షాదిఖానా, బస్టాండ్‌, వైరా రోడ్డు, జడ్పీ సెంటర్‌, శివశంకర్‌ టాకీస్‌ మీదుగా పాకబండ వరకు షర్మిల పాదయాత్ర చేస్తారు. ఇవాళ 11.2 కిలో మీటర్ల మేర పాదయాత్ర జరగనుంది.

Back to Top