'ఆస్తుల అటాచ్‌మెంట్‌ ఆర్డరే.. జడ్జిమెంట్ కాదు'

హైదరాబాద్: వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయ‌స్ జగన్మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడుల విషయంలో రాంకీ సంస్థ ఆస్తులను ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్ చేయడం ఒక ఎగ్జిక్యూటి‌వ్ ఆర్డ‌రే కాని అదే జడ్జిమెంట్ కాదని వై‌యస్‌ఆర్‌సిపి అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధినేత శ్రీ జగన్‌ను ఇబ్బందులు పెట్టేందుకు ప్రభుత్వ సంస్థలు సిబిఐ, ఈడీలను ఉపయోగించుకొని అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం ‌టిడిపి కుమ్మక్కై సాగిస్తున్న కుట్రలు తార స్థాయికి చేరాయని ఆయన దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మంగళవారంనాడు గట్టు మీడియాతో మాట్లాడుతూ.. రాంకీ సంస్థకు భూముల విషయంలో దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చేసిన మే‌లు ఏమీ లేదన్నారు. అంతకు ముందు చంద్రబాబు హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాన్నే మహానేత వైయస్‌ కొనసాగించారని గట్టు చెప్పారు.
Back to Top