ఆరుగొలను నుంచి షర్మిల పాదయాత్ర

గుడివాడ, 10 ఏప్రిల్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. గుడివాడ నియోజకవర్గం ఆరుగొలను నుంచి బుధవారం ఉదయం ఆమె పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర కానుమోలు, పెరికీడు నుంచి హనుమాన్‌ జంక్షన్‌ చేరుకుంటుంది. హనుమాన్‌ జంక్షన్‌లో బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు. ఈ రోజు షర్మిల 13.4 కిలో మీటర్లు నడుస్తారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు.

Back to Top