ఆ ప్రకటన మోసపూరితం: నాగిరెడ్డి

విజయవాడ, 18 ఏప్రిల్ 19:

విద్యుత్తు కోతలు తగ్గిస్తామని ఆర్ధికమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి చేసిన ప్రకటనలు మోసపూరితమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం కన్వీనర్ నాగిరెడ్డి ఆరోపించారు. 61 మిలియన్ యూనిట్ల కొరత ఉంటే 39 మిలియన్ యూనిట్ల కొరత ఉందని నాయకులు అబద్దాలు చెబుతున్నారని ఆయన  మండిపడ్డారు. పట్టణ, పల్లెల తేడా చూపుతూ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2008-09 నాటి ఇన్‌ పుట్‌ సబ్సిడీ బకాయిలను ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదని  నాగిరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.

Back to Top