ఆపద్బాంధవుడు డాక్టర్ వైయస్

అనంతపురం:

నిరుపేదలు, రైతులు, చేనేత కార్మికులు, మహిళలు, విద్యార్థులు తదితర అన్ని వర్గాల వారి అభ్యున్నతికి దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఎనలేని కృషి చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  నాయకులు కొనియాడారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రాష్ర్ట ప్రజలకు ఆపద్బాంధవుడు లాంటి వారని  కొనియాడారు. ‘కదలిక’ సంపాదకుడు ఇమామ్ రచించిన ‘జనం చెక్కిన శిల్పం’ పుస్తకాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, నాయకులు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, బి.ఎర్రిస్వామిరెడ్డి, సాలార్‌బాషా, మీసాల రంగన్న, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, రిలాక్స్ నాగరాజు, బోయ సుశీలమ్మ, శ్రీదేవి తదితరులు మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాను కూడా రైతు పక్షపాతినని గొప్పలు చెప్పుకునేందుకు మాత్రమే పరిమితమయ్యారన్నారు.  ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం పేరుతో దేశ చరిత్రలోనే కనీ..వినీ.. ఎరుగని రీతిలో నిరుపేదలకు పక్కా గృహాలు మంజూరు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.  అప్పుల బాధతో తనువు చాలించిన రైతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకున్నారన్నారు.  ప్రాజెక్టులు నిర్మించి.. జలయజ్ఞం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు.  అక్రమ కేసులను బనాయించి జన నేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించాయని ధ్వజమెత్తారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

Back to Top