ఆ పార్టీలు ఎన్నికలకు సిద్ధంగాలేవు

హైదరాబాద్, 15 ఏప్రిల్ 2013:

అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన ఎమ్మెల్యేల అంశంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వకర్త కొణతాల రామకృష్ణ అసెంబ్లీ స్పీకరు నాదెండ్ల మనోహర్‌ను కోరారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి, ఖాళీలను నోటిఫై చేయాలనీ, ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలనీ కొణతాల విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల సభ్యత్వం పోగొట్టాలి తప్ప ఎన్నికలు రాకూడదనే వ్యూహంతో కాంగ్రెస్, టీడీపీలు వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ఎన్నికలను ఎదుర్కొనడానికి సిద్ధంగా లేవని అభిప్రాయపడ్డారు. అందుకే ప్రక్రియ జాప్యం చేస్తున్నారని శాసన సభ్యులే చెబుతున్నారని పేర్కొన్నారు. మనస్ఫూర్తిగానే తాము విప్ ఉల్లంఘించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశామని కూడా వారు స్పష్టంచేశారన్నారు. ఈ అంశంపై వెంటనే నిర్ణయం తీసుకుంటే ఎన్నికలొస్తాయని కొణతాల చెప్పారు.

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుటుంబంపై మంత్రి ఆనం వ్యాఖ్యలు సబబు కాదన్నారు. డాక్టర్ వైయస్ఆర్
హయాంలోని 26 జీవోలు తప్పయితే తనతో సహా నాటి మంత్రులను ఉరితీయాలన్నారు.
ఆనంకు ఇన్నేళ్ల తర్వాత ఈ విషయం గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. కేవలం
శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులు పాలు చేయడానికే ఈ నాటకమాడుతున్నారన్నారు.

Back to Top