'ఆ పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారు'

శ్రీకాళహస్తి:

కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన దివంగత మహానేత డాక్టర్ వై.యస్‌. రాజశేఖర రెడ్డి  కుటుంబంపై  కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ శ్రీకాళహస్తి నియోజకవర్గ నేత బియ్యపు మధుసూదనరెడ్డి తెలిపారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్. జగన్మోహన్‌ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ, ఢిల్లీ అత్యాచార బాధితురాలు నిర్భయ మృతికి నివాళులర్పిస్తూ మంగళవారం శ్రీకాళహస్తిలో భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత పట్టణంలోని దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్టీసీ సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మధుసూదన రెడ్డి మాట్లాడుతూ మహానేత వైయస్‌ఆర్ రెక్కల కష్టంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. శ్రీ వైయస్. జగన్మోహన్‌ రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఒక్కటై కుట్రలు చేస్తున్నాయని తెలిపారు. ఈ కుట్రలు, కుతంత్రాలను ప్రజలు నిశితంగా ప రిశీలిస్తున్నారని, సరైన సమయంలో బు ద్ధి చెబుతారని చెప్పారు. ఢిల్లీలో అత్యాచారానికి గురై మృతి చెం దిన నిర్భయ ఘటనలో నిందితులకు ఉరిశిక్షే సరైన తీర్పని మధుసూదనరెడ్డి అన్నారు.

Back to Top