'ఆ పార్టీలకు జనమే గుణపాఠం చెబుతారు'

వరంగల్‌ : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టించిన కాంగ్రెస్‌, టిడిపిలకు రాష్ట్ర ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వైయస్‌ఆర్‌సిపి వరంగల్‌ జిల్లా కన్వీనర్‌ చెరుకుపల్లి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని వెంటనే విడుదల చేయాలని శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‌శ్రీ జగన్మోహన్‌రెడ్డిని విడుదల చేయాలని కోరుతూ హన్మకొండలోని పార్టీ జిల్లా కార్యాలయంలో చేపట్టిన సంతకాల సేకరణను బుధవారం ఆయన ప్రారంభించారు. తొలుత చెరుకుపల్లి సంతకం చేశారు.

అక్రమాలు జరిగాయని చెబుతున్న సమయంలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఎలాంటి పదవిలోనూ లేరని, అయినా ప్రభుత్వం, విపక్షం కుట్ర పన్ని కేసుల్లో ఇరికించాయని చెరుకుపల్లి ఆరోపించారు. శ్రీ జగన్‌కు, వైయస్‌ఆర్‌సిపికి వస్తున్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్, ‌టిడిపిలు జీర్ణించుకోలేక ఈ కుట్రకు పాల్పడ్డాయన్నారు. అధికార పక్షానికి ఒక విపక్షం సహకరించడం ఇక్కడే చూస్తున్నామని ఆయన ధ్వజమెత్తారు.
Back to Top