'ఆనం వ్యాఖ్యలకు బొత్స సమర్థనా.. విడ్డూరం'

విశాఖపట్నం, 14 ఏప్రిల్‌ 2013 : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, కడప లోక్‌సభ సభ్యుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడడ్డిపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలను పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమర్థించడం విడ్డూరం, విచారకరం అని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ ‌కేంద్ర పాలక మండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. విశాఖపట్నంలో ఆయన ఆదివారంనాడు విలేకరులతో మాట్లాడారు. వివాదాస్పదమైన 26 జిఓలపై ప్రభుత్వం సకాలంలో హైకోర్టులో పిటిషన్ వే‌సి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కొణతాల అభిప్రాయపడ్డారు.

దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ‌పుణ్యం వల్లే రాష్ట ప్రజలు సుభిక్షంగా ఉన్నారని కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి విషయంలో సుప్రీం ఆదేశాలను సిబిఐ తుంగలోతొక్కి, చార్జిషీట్లు ఫైల్ చేస్తోందని ఆయన ఆరోపించారు. సోనియా అల్లుడు వాద్రాకు ఒక న్యాయం... శ్రీ వైయస్ జగ‌న్‌ న్యాయమా? అని కొణతాల రామకృష్ణ ప్రశ్నించారు.

తాజా ఫోటోలు

Back to Top