వైవీ సుబ్బారెడ్డి పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తు వెల్లువ‌ ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టు సాధనకు వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు, తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లాలో చేపట్టిన ప్రజా పాదయాత్ర 9వ రోజు కొనసాగుతోంది. సుబ్బారెడ్డి పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తు వెల్లువెత్తుతోంది. గానుగ‌పెంట వ‌ద్ద  వైవీ సుబ్బారెడ్డి పాదయాత్రకు మాజీ మంత్రి వెంకట రమణ మద్దతు తెలిపారు. కాగా దారి పొడవునా ప్రజలు వైవీ సుబ్బారెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తేనే సాగునీరు వస్తుందని పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తామని హామీ ఇస్తున్నారు. 
 
‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍
‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍
Back to Top