882.2 కి.మీలు పూర్తయిన షర్మిల పాదయాత్ర

నల్గొండ, 9 ఫిబ్రవరి 2013: కాంగ్రెస్‌ పార్టీ అసమర్థ పాలనకు, దానికి వంత పాడుతున్న చంద్రబాబు తీరుకు నిరసనగా శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 61వ రోజు ముగిసేసరికి మొత్తం 882.2 కిలోమీటర్లు నడిచారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రరెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల ఈ చారిత్రక పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

 శ్రీమతి షర్మిల పాదయాత్రకు గ్రామగ్రామాన ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తోంది. అభిమానులు, కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు ఆమెను చూసేందుకు, ఆమె ప్రసంగం వినేందుకు ఎనలేని ఆసక్తి కనబరుస్తున్నారు.
Back to Top