ప్రజల ఇబ్బందులు ప్రభుత్వం గుర్తించదా: మిథున్‌రెడ్డి

రాజంపేట: పాస్‌పోర్ట్ సేవలు విశాఖపట్నానికి తరలిస్తే రాయలసీమ జిల్లాల వాసుల పరిస్థితి ఏమిటి? చిన్నపనైనా 700 కిలోమీటర్లు వెళ్లగలరా? నా నియోజకవర్గం నుంచి వేలాది మంది గల్ఫ్ దేశాలకు వెళుతుంటారు. వాళ్లలో చాలామంది నిరక్షరాస్యులు. వారు విశాఖపట్నం వెళ్లగలరా? అసలు దరఖాస్తుదారుల ఇబ్బందులు ఈ ప్రభుత్వం గుర్తించలేదని స్పష్టమైంది. అందరికీ అందుబాటులో పాస్‌పోర్ట్ సేవలు ఉండేలా చేయాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు, విదేశాంగ కార్యదర్శికి లేఖ రాస్తా. అవసరమైతే పార్లమెంటులో దీనిపై ప్రశ్నిస్తా.
-పి.మిథున్‌రెడ్డి, పార్లమెంట్ సభ్యులు, రాజంపేట
Back to Top