ఏడో రోజుకు చేరిన మేల్కొలుపు పాదయాత్ర

అనంతపురం: రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన మేలుకొలుపు పాదయాత్ర ఏడోరోజుకు చేరింది. గురువారం ఈస్ట్‌ నర్సాపురం నుంచి ఇల్లూరు వరకు పాదయాత్ర కొనసాగనుంది. రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా పద్మావతి చేపట్టిన పోరుబాటకు విశేష స్పందన లభిస్తోంది. ఎల్లనూరు నుంచి గార్లెదిన్నె వరకు సుమారు 150 కిలోమీటర్లు, పదిరోజుల పాటు ఈ యాత్ర కొనసాగనున్న విషయం తెలిసిందే. 

తాజా ఫోటోలు

Back to Top