వైయ‌స్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి
- సెఫ్టిక్‌ ట్యాంక్‌ క్లీన్‌ చేస్తూ  ఏడుగురు దుర్మరణం 
- మృతుల కుటుంబాల‌కు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌గాఢ సానుభూతి
 
 చిత్తూరు : చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరంలో సెఫ్టిక్‌ ట్యాంక్‌ క్లీన్‌ చేస్తూ అస్వస్థతకు గురైన ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ ఘ‌ట‌న‌పై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిగ్ర్భాంతికి గుర‌య్యారు. కార్మికుల మ‌ర‌ణ వార్త విన‌గానే వైయ‌స్ జ‌గ‌న్ పార్టీ నాయ‌కుల‌కు ఫోన్ చేసి వివ‌రాలు తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాల‌ని ఆదేశించారు. బాధిత కుటుంబాల‌కు  వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు.  శుక్రవారం ఉదయం  శ్రీ వెంకటేశ్వర హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ (వీహెచ్‌పీఎల్)కు చెందిన సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేసేందుకు మొత్తం ఎనిమిది మంది వెళ్లారు. కాగా ట్యాంక్‌ నుంచి ఒక్కసారిగా విష వాయువు వెలువడటంతో ఎనిమిదిమంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారిలో ఏడుగురు మృతి చెందగా, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతులు మొరం గ్రామ సమీపానికి చెందినవారు. మృతులు రెడ్డప్ప, రమేష్‌, రామచంద్ర, కేశవ, గోవిందస్వామి, బాబు, వెంకట్రాజులుగా గుర్తించారు.  


Back to Top