6న పార్టీలో చేరనున్న శ్రీశైలంగౌడ్

హైదరాబాద్, 03 మే 2013:

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఈనెల 6వ తేదీన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో లాంఛనంగా చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం మీడియాకు వెల్లడించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరతానన్నారు.  నియోజకవర్గ కార్యకర్తల కోరిక, ఒత్తిడి మేరకు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు శ్రీశైలంగౌడ్ తెలిపారు.  దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ఆర్‌ పాలన శ్రీ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. గత నెలలో శ్రీశైలం గౌడ్ శ్రీ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. శ్రీమతి విజయమ్మను కూడా అదే రోజు కలిశారు. ఇటీవలి కాలంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలోనూ ఆయన పాల్గొంటున్నారు. శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచి, కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు.

Back to Top