6న కోవూరు నియోజకవర్గ ప్లీనరీ

నెల్లూరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు నియోజ‌క‌వ‌ర్గ ప్లీన‌రీ ఈ నెల 16న నిర్వ‌హిస్తున్న‌ట్లు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ప్లీనరీ నిర్వహణకు కోవూరులోని రుక్మిణి కల్యాణ మండపాన్ని ఆయన  పరిశీలించారు. ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ..పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు పార్టీ ప్లీనరీ నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. ఈ స‌మావేశానికి నెల్లూరు, తిరుపతి ఎంపీలు రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌రావు, జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి,  పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు హాజరవుతారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.  
Back to Top