60వ రోజు ప్రారంభమైన షర్మిల యాత్ర

ఇబ్రహీంపట్నం, 08 ఫిబ్రవరి 2013:

రంగారెడ్డి జిల్లా చౌదర్‌పల్లి నుంచి శ్రీమతి వైయస్ షర్మిల శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో 60వ రోజు మరో ప్రజాప్రస్థానాన్ని ప్రారంభించారు. యాచారం, నక్కలగుట్ట తండా, చింతపట్ల తండా తమ్మలోని గూడెం గేటు మీదుగా యాత్ర సాగుతుంది. మాల్ గ్రామం వద్ద యాత్ర నల్గొండ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఏర్పాటయ్యే బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల బుధవారం నాడు మరో ప్రజాప్రస్థానం యాత్రను పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. గురువారం చౌదర్‌పల్లి వద్ద యాత్ర ముగిసేనాటికి ఆమె 852.4 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.

Back to Top