వైయస్‌ఆర్‌ సీపీలో 60 కుటుంబాలు చేరిక

చిత్తూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలంతా నమ్ముతున్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వాన్ని బలపర్చేందుకు వందల కుటుంబాలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నాయని రాజీనామా చేసిన వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. పీలేరు నియోజకవర్గం కేవీపల్లి మండలం జిల్లెళ్లమంద పంచాయతీ పెద్దబిడికిలో మాజీ సర్పంచ్‌ పరశురాముడుతో సహా 60 కుటుంబాలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిలు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top