నల్లగొండలో ప్రవేశించనున్న పాదయాత్ర

హైదరాబాద్:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించనుంది. దేవరకొండ నియోజకవర్గంలోని మాల్ గ్రామం వద్ద యాత్ర నల్లగొండ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. పార్టీ నల్లగొండ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. జిల్లాలో ఆరు నియోజకవర్గాలలో యాత్ర సాగుతుంది. పదిరోజుల పాటు సాగే ఈ పాదయాత్రలో శ్రీమతి షర్మిల 135 కి.మీ. నడుస్తారని ఆయన వివరించారు.

Back to Top