నంద్యాలలో భారీ చేరికలు.. వైయస్సార్సీపీలోకి 500మంది యువకులు

కర్నూలుః నంద్యాల నియోజకవర్గం గుడిపాటి గడ్డ ప్రజలు పెద్ద ఎత్తున వైయస్సార్సీపీలో చేరారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా వైయస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దేశం సులోచన, రాష్ట్ర మార్క్ ఫెడ్ ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి, సీఈసీ సభ్యుడు గుడిపాటి గడ్డలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 500మంది యువకులు వైయస్సార్సీపీలో చేరారు. వీరికి శిల్పా పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైయస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు పథకాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయని పార్టీ నేతలు అన్నారు.

తాజా వీడియోలు

Back to Top