వైయస్‌ఆర్‌ సీపీలో 500ల మంది చేరిక

కాకినాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించేందుకు కాకినాడ ప్రజలు సిద్ధమవుతున్నారు. కాకినాడ నగర కార్పొరేషన్‌ పరిధిలోని 47వ డివిజన్‌లో సుమారు 500 మంది వైయస్‌ఆర్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా అధికశాతం మంది పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. పార్టీ నగర కోఆర్డినేటర్‌ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సోదరుడు వీరభద్రారెడ్డి సమక్షంలో మోర్త కోటి, కొండేపూడి వీరేంద్ర, పలివెల నాగరాజుల ఆధ్వర్యంలో సుమారు 300ల మంది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదే విధంగా కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ చలమలశెట్టి సునీల్‌ సమక్షంలో ముంజరపు రమాకాంత్, కందుకూరి సూరిబాబు, పిల్లి ప్రసాద్, కాల్దరి పద్మ, బచ్చల బుజ్జి, నూతలపాటి కృష్ణ తదితరుల ఆధ్వర్యంలో 200ల మంది వైయస్‌ఆర్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్నారన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top