వైయస్‌ఆర్‌ సీపీలో చేరిన 500ల టీడీపీ కుటుంబాలు

వినుకొండ

: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. నాలుగేళ్లుగా చంద్రబాబు పాలనలో విసుగెత్తిన టీడీపీ నేతలు ప్రతిపక్ష పార్టీని ఆశ్రయిస్తున్నారు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గ పరిధిలోని నడిగడ్డ గ్రామానికి చెందిన 500ల టీడీపీ కుటుంబాలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఇన్‌చార్జి బొత్స సత్యనారాయణ వారికి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బొత్స మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు తదితరులు ఉన్నారు. 

Back to Top