50 టీడీపీ కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌


బనగానపల్లె: టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం హుశ్సేనాపురం గ్రామానికి చెందిన ఎద్దింటి గూడుబాయి, చాంద్‌బాషా, రఫీ, చిన్నా, ఇదుర్‌సా, రాజా హుస్సేన్‌ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వీరికి కండువాలు కప్పి రామిరెడ్డి వైయస్‌ఆర్‌సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ..మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుందని, వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
Back to Top