వైయస్ఆర్ కుటుంబంలో 50లక్షల మంది చేరిక

  • వైయస్ఆర్ పాలనలో ఓ భరోసా ఉండేది
  • బాబు వచ్చాడు అన్నీ కష్టాలే
  • బాబు పాలనను ప్రతి ఒక్కరూ ఛీ కొడుతున్నారు
  • మోసకారి ప్రభుత్వం ఎప్పుడు పోతదా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు
  • ప్రజాసమస్యలపై జననేత అలుపెరగని పోరాటం
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి
విజయవాడః రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం తర్వాత మరొకసారి పార్టీకి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ పలకరించే అవకాశం లభించిందని అన్నారు. ప్రజలు వైయస్సార్సీపీ శ్రేణులను సాదరంగా ఆహ్వానించి వారి ప్రశ్నలకు సావధానంగా మూడున్నరేళ్లలో తాము పడుతున్న ఇబ్బందులను ఏకరవు పెడుతున్నారన్నారు. ఫోన్ ద్వారా వైయస్ఆర్ కుటుంబంలో చేరిన వారి సంఖ్య 50 లక్షలకు చేరుకుందని పార్థసారధి చెప్పారు. వారంతట వారే జగన్ మాటలు వినాలని,  వైయస్ఆర్ కుటుంబంలో సభ్యులుగా చేరాలని సంతోషంగా ఫోన్స్ చేస్తున్నారని తెలిపారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్థసారధి మాట్లాడారు. 

గతంలో ఎన్నో ప్రతిపక్షాలను చూశామని, కానీ వైయస్ జగన్ చేసినన్ని ప్రజా పోరాటాలు మరే నాయకుడు చేయలేదన్నారు. వైయస్ జగన్ నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడుతూ ప్రభుత్వ తప్పులు, వైఫల్యాల మీద ఎప్పటికప్పుడు నిలదీస్తూ నిద్ర లేకుండా చేస్తున్నారన్నారు. టీడీపీ వాళ్లు నంద్యాల గెలుపును చూసి చంకలు గుద్దుకోవడం హాస్యాస్పదమన్నారు. నంద్యాల గెలుపు గెలుపు కాదని అది బలుపని ఆ పార్టీ నేతలే చెబుతున్నారన్నారు.  వైయస్ జగన్ ను ఎదుర్కొనేందుకు ఎన్ని వందల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందో,  అధికారమదంతో ఎంతమందిని బెదిరించాల్సి వచ్చిందో, ఎన్ని వేల కోట్లు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రకటించాల్సి వచ్చిందో టీడీపీ నేతలు తమ గుండెల మీద చేయివేసుకొని ఆత్మపరిశీలన చేసుకుంటే అర్థమవుతుందన్నారు.  
 
ఇంటింటికీ వెళ్లి వైయస్ఆర్ పాలన గుర్తుందా అని అడిగితే....వైయస్ఆర్ బతికున్నప్పుడు పదేళ్ల వయస్సున్న వ్యక్తి కూడ మహానేత అద్భుతమైన పాలన చేశాడని చెబుతురున్నాని పార్థసారధి తెలిపారు.  పేదవాడికి బెంగ లేకుండా పాలించిన గొప్ప నాయకుడు వైయస్ఆర్ అని ప్రతి ఒక్కరూ తమకు చెబుతున్నారు. పెన్షన్, ఆడపిల్లలకు పట్టాలు, కార్పొరేట్ ఆస్పత్రులలో వైద్యం, గూడు లేనివాడికి ఆంక్షలు లేకుండా ఇళ్లు శాంక్షన్ చేయడం. ఎస్సీ, ఎస్టీలకు మూడు నాలుగు విడతల్లో 10 లక్షల ఎకరాలు పంపిణీ చేసిన ఘనత వైయస్ఆర్ దని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని పార్థసారధి పేర్కొన్నారు.  ఇళ్ల స్థలాలు, పెన్షన్  సహా సంక్షేమ పథకాల్లో వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్న ఆలోచన విధానం వైయస్ఆర్ దని.... బాధతో, కళ్లు చెమర్చి ప్రజలు వైయస్ఆర్ ను గుర్తు చేసుకుంటున్నారని పార్థసారధి అన్నారు.

వైయస్ఆర్ పాలనకు చంద్రబాబు పాలనకు నక్కకు, నాగలోకానికున్న తేడా ఉందని ప్రజలే చెబుతున్నారని పార్థసారధి పేర్కొన్నారు. ఆనాడు బతుకుమీద భరోసా ఉండేదని, కానీ  ఈనాడు అది లేదని స్పష్టం చేస్తున్నారన్నారు. బాబు అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లయ్యింది. పెన్షన్ ఇవ్వడం లేదు. అర్హత ఉండి కూడ పెన్షన్ కోల్పోయాం. శంకుస్థాపన చేసి కనీసం డబ్బులు కూడ ఇవ్వకుండా మోసం చేశారు.  ఇళ్లు నిర్మించింది లేదని ప్రజలే తమకు చెబుతున్నారని పార్థసారధి తెలిపారు.  కృష్ణా జిల్లాలో సెంటు భూమి ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. జన్మభూమి కమిటీల కబంధ హస్తాల్లో పెన్షన్ దారులు నలిగిపోతున్న పరిస్థితి ఉందని అన్నారు. ఎప్పుడీ ప్రభుత్వం పోతదా...? మంచి పరిపాలన ఇచ్చే ప్రభుత్వం ఎప్పుడొస్తుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని పార్థసారధి అన్నారు. రాజధానిలో ఒక్క ఇటుక కూడ పేర్చకుండా,  భవనం నిర్మించకుండా...వచ్చే ఎన్నికల్లో రాజధాని అమరావతిలో కావాలంటే బాబుకు ఓటేయాలని చెబుతాడేమోనని ప్రజలు అనుమానపడుతున్నారన్నారు. బాబు కుయుక్తుల్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. 

ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇచ్చారా అని అడిగితే...? ప్రతి ఒక్కరూ ఇవ్వలేదని సమాధానం చెప్పారన్నారు. వందమందిలో ఒక్కరికి కూడ రుణమాఫీ జరిగిన పరిస్థితులు లేవన్నారు. డ్వాక్రా రుణమాఫీ అంతా మోసమని మహిళలంతా ముక్తకంఠంతో బాబును తిట్టిపోస్తున్నారని పార్థసారధి అన్నారు. ఆయనిచ్చిన 6వేలు అప్పుమీద బ్యాంకులు వసూలు చేసిన వడ్డీలకు కూడ సరిపోలేదన్నారు.  రాష్ట్రమంతా 6వేలు రెండు విడతలుగా ఇస్తే, నంద్యాలలో ఎన్నికలున్నాయని 10 వేలిచ్చారని ..మహిళలంతా మోసకారి బాబును ఛీకొడుతున్నారన్నారు. మీకు అనుమానముంటే ప్రజల్లోకి వస్తే నిరూపిస్తామని టీడీపీకి పార్థసారధి సవాల్ విసిరారు. 

తాజా వీడియోలు

Back to Top