హైదరాబాద్: ‘‘తెలంగాణ ముఖ్యమంత్రివర్యా ఓ చంద్రశేఖరా.. అమాయక తెలంగాణ ప్రజ లు నిన్ను నమ్మారు.. నీ తెలంగాణ ఉద్యమ స్ఫూ ర్తిని విశ్వసించారు. నీ పాలన ఎలాగుందో ఒకసారి వెనుతిరిగి చూసుకో.. వృద్ధులు, మహిళలు, రైతు లు, విద్యార్థులు ఇలా అందరూ నిన్ను నమ్మా రు.. నమ్మిన వారిని అన్ని రకాలుగా హింసిస్తున్నా వ్.. నీ పాలన ఇలాగే కొనసాగిస్తే తెలంగాణ బిడ్డల ఉసురు తగలకపోదు జాగ్రత్త.. నిన్ను నీవు కాపాడుకొనేందుకైనా ప్రజలు కొరుకొనే పాలన అందించాలి’’ అని సీఎం కేసీఆర్‌కు వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షు డు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. కోర్టుకు విచారణ ఖైదీలను తీసుకువస్తున్న తరుణంలో ఐదుగురిని ఎన్‌కౌంటర్ పేరిట మట్టుబెట్టడం గర్హనీయమన్నారు. ఈ ఎన్‌కౌంటర్ యావత్ తెలంగాణ ప్రజలు అనుమానపడేలా ఉందని పేర్కొన్నారు. గురువారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ గ్రేటర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ అరకొర రుణమాఫీ వల్ల రైతులకు ఒరిగిందేమిలేదన్నారు. తొలి సీఎంగా ప్రమాణం చేసిన కేసీఆర్ ఏదో చేస్తారని ప్రజలు ఆశిస్తే వారి ఆశలపై ఆయన నీళ్లు చల్లుతున్నారని చెప్పారు.