బాబుకు జగన్ ఫియర్..31 నుంచి అసెంబ్లీ సమావేశాలు..

ఈనెల 31 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఐదు రోజుల పాటు సమవేశాలు వాడీవేడీగా సాగనున్నాయి.  ప్రజాసమస్యలపై అసెంబ్లీలో తమ వాణివినిపించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ సర్వం సన్నద్ధమైంది.  సోమవారం  నుంచి ప్రారంభం కానున్న ఈసమావేశాల్లో ....మొత్తం 19 అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైసీపీ సమాయత్తమయ్యింది.  రాష్ట్రంలో చంద్రబాబు సాగిస్తున్న రాక్షసపాలనను అసెంబ్లీలో  ఎండగట్టాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి  నిర్ణయించారు. 

ప్రత్యేక హోదా, భూసేకరణ, ఓటుకు నోటు కేసు, పుష్కరాల్లో తొక్కిసలాట, రితికేశ్వరి మరణం సహా అనేక అంశాలపై చర్చకు పట్టుబట్టనున్నారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలతో  ఇప్పటికే భూసేకరణపై వెనక్కి తగ్గిన  సర్కార్  .....అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే విషయంలో మల్లగుల్లాలు పడుతోంది.  అసెంబ్లీలో ప్రతిపక్షం లేవనెత్తే వివిధ అంశాలపై ఎలా సమాధానం ఇవ్వాలో తెలియక మంత్రులు, ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు.  

ఆంధ్రప్రదేశ్ ను జపాన్ లా చేస్తాం...సింగపూర్ లా తీర్చిదిద్దుతాం అంటూ ... కల్లబొల్లి మాటలతో ప్రజలను ఎప్పటికప్పుడు మభ్యపెడుతూ తప్పించుకుంటున్న బాబు  అసలు రంగు అసెంబ్లీలో బయటపటపెడతామని వైసీపీ నేతలు అంటున్నారు.  స్పెషల్ స్టేటస్ కోసం ప్రజలు ఆత్మబలిదానాలు చేసుకుంటున్నా బాబు సర్కార్ లో ఎలాంటి కదలిక లేదని విమర్శిస్తున్నారు. ఇక  రాష్ట్రమంత్రి  నారాయణ విద్యాసంస్థల్లోనే విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని , వరుస ఆత్మహత్య ఘటనలు కలకలం రేపుతున్నా మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ర్యాగింగ్ కు విద్యార్థినుల ప్రాణాలు బలవుతున్నా వాటిని అరికట్టడంలో ఘోరంగా విఫలమవుతున్నారని దుయ్యబట్టారు. సీజనల్  వ్యాధులతో ప్రజలు మృత్యువాత పడుతున్నా వైద్,ఆరోగ్యశాఖకు పట్టడం లేదన్నారు. మొత్తంగా రాష్ట్రంలో నెలకొన్న సమస్యలన్నంటినీ  అసెంబ్లీలో వినిపించేందుకు వైసీపీ రెడీ అవ్వడంతో అధికార పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. 
Back to Top