వైయస్ఆర్ కుటుంబంలో 38లక్షల మంది చేరిక

  • వైయస్సార్ కుటుంబం కార్యక్రమం ప్రారంభమై 11 రోజులు పూర్తి 
  • ఇప్పటికి 38 లక్షల మంది వైయస్సార్ కుటుంబంలో చేరిక 
  • రాష్ట్ర స్థాయిలో పార్టీ సీనియర్లు మరియు ముఖ్య నేతలతో వైయస్ జగన్ సమీక్ష 
  • నియోజికవర్గ స్థాయిలో ఎంఎల్ఏలు, ఇంచార్జ్ లు, సమన్వయకర్తలు సమీక్షా సమావేశాలు 
  • ఇప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై సమీక్ష. 
  • భవిష్యత్ కార్యాచరణపై పార్టీ సీనియర్లు మరియు ముఖ్య నేతలకు వైయస్ జగన్ దిశానిర్దేశం 
అమరావతిః ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించాలనే భావనతో సెప్టెంబర్ 11న  ప్రారంభమైన  వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి కుటుంబం నేను వైయస్ఆర్ కుటుంబం అని సగర్వంగా చెబుతోంది. 11 రోజుల్లో 38 లక్షల మంది వైయస్సార్ కుటుంబంలో చేరారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే 4.3 లక్షల వైయస్ఆర్ సీపీ పార్టీ బూత్ కమిటీ సభ్యులకు శిక్షణ కార్యక్రమం ఈ సెప్టెంబర్ 2 వ తారీఖున ప్రారంభమైంది. పార్టీ ముఖ్య నేతలతో వైయస్ జగన్ వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.   

ఈ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందిన సభ్యులు ఈనెల 11 నుంచి రాష్ట్రంలోని ప్రతీ గడపకు వెళ్తున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, పెన్షన్ లతో పేదవాడు లబ్ది పొందిన రాజన్న రాజ్యాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంటి పాలనను మరోసారి ప్రజలందరికి అందించేందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాల గురించి వివరిస్తున్నారు . ఇంటి నుంచి ఒక్కరైనా వైయస్ఆర్ కుటుంబంలో భాగం అయ్యేలా చేస్తున్నారు

ఇందు కోసం  ఆధునిక టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు. 9121091210 ఫోన్ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా రాష్ట్రంలోని ఎవరైనా వైయస్ఆర్ కుటుంబంలోభాగం కావొచ్చని వివరిస్తున్నారు . దీంతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలన పై అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు . రాష్ట్ర ప్రభుత్వ పాలనకు ఒకవేళ మార్కులు వేయాల్సి వస్తే ఎన్ని వేస్తారో వేయాలని అడుగుతున్నారు. బాబు వైఫల్యాలను ఇంటింటా వివరిస్తున్నారు.  

వైయస్ఆర్ కుటుంబ లో భాగంగా ఇంటింటికి వెళ్లే కార్యకర్తలకు ఒక కిట్ ను అందచేస్తారు.   కిట్ లో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలు, గైడ్, విజిటింగ్ కార్డు, బాబు పాలనపై మార్కులు వేసే పత్రం, వైయస్ఆర్ బ్యాడ్జి, వైయస్ఆర్ కుటుంబం లో చేరిన తర్వాత వారి ఇంటికి వైయస్ఆర్ కుటుంబం అని అంటించే స్టిక్కర్ ఉంటాయి. సెప్టెంబర్ 11 తేదీ నుంచి అక్టోబర్‌ 2వ తేదీవరకు 20 రోజులపాటు వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం కొనసాగుతుంది. 

తాజా ఫోటోలు

Back to Top