ఎమ్మెల్యే కిడారి హత్య చంద్రబాబు వైఫల్యమే..

విజయనగరంః  జిల్లాలో వైయస్‌ఆర్‌ చేసిన అభివృద్ధిని ఎవరూ చెరపలేరని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు.  జననేత వైయస్ జగన్  మోహన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్న ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తోటపల్లి, జంఝావతి, పెద్దగెడ్డ ప్రాజెక్టులను కట్టించిన ఘనత వైయస్‌ఆర్‌దే అని అన్నారు. వైయస్‌ హయాంలోనే ఏయూ కేంద్రం,జెఎన్‌టీయూ కాలేజీలు వచ్చాయన్నారు. ఎమ్మెల్యే కిడారి హత్యకు చంద్రబాబు వైఫలమ్యే కారణమన్నారు. తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోడానికి  చంద్రబాబు, టిడిపి నాయకులు ప్రతిపక్షంపై నిందలు మోపడం సరికాదని, మైనింగ్‌ అవినీతి వల్లే చంపారని కిడారి డ్రైవర్,గన్‌మెన్‌లే చెప్పారన్నారు. డీజీపీ కూడా ఎమ్మెల్యేను మావోయిస్టులు చంపారని స్పష్టం చేశారన్నారు.చంద్రబాబు అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు.
Back to Top