ఎమ్మెల్యే కోటంరెడ్డి పాద‌యాత్ర ప్రారంభం

 
నెల్లూరు :   నెల్లూరు రూరల్ వైయ‌స్ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 366 రోజుల ప్రజా ప్రస్థాన పాదయాత్ర కార్యక్రమాన్నిమొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ..వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర స్ఫూర్తితో పాద‌యాత్ర చేప‌ట్టిన‌ట్లు చెప్పారు. ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి గుడి, మసీదు, చర్చిలను సందర్శిస్తానని తెలిపారు. 1001 మంది ఆడపడుచుల ఆశీర్వాదం తీసుకుంటానని వెల్లడించారు. 150 పల్లెల్లో నిద్ర చేస్తానని వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


Back to Top