పట్టరాని సంతోషంలో ముమ్మడివరం

ఎక్కడ చూసినా జననేత ఫ్లెక్సీలు
ఆకట్టుకుంటున్న వైయస్‌ జగన్‌ కటౌట్లు
తూర్పుగోదావరి: జననేత రాకతో ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలకు పట్టరాని సంతోషంలో మునిగిపోయారు. 201వ రోజు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా అమలాపురం భీమనపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించిన సింగరాయపాలెం మీదుగా ముమ్మడివరం నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. ఈ మేరకు ప్రజలు పాదయాత్రకు ఘనస్వాగతం పలికి.. మహిళలు జననేతకు హారతిచ్చి ఆహ్వానించారు. సాయంత్రం ముమ్మిడివరం హైస్కూల్‌ సెంటర్‌లో జరుగనున్న భారీ బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎక్కడ చూసినా జనతనే ఫ్లెక్సీలు, నవరత్నాల బ్యానర్లు, వైయస్‌ఆర్‌ సీపీ జెండాలు దర్శనమిస్తున్నాయి. బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. పాదయాత్ర సాగే దారి వెంబడి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి. బహిరంగసభలో వైయస్‌ జగన్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. 
Back to Top