హోదాపై బాబుది మొసలికన్నీరు

తిరుపతి: ప్రత్యేక హోదాపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో భూమన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అంటే జైల్లో పెడతానన్న చంద్రబాబు ఇప్పుడు ప్రజలు అంతా గమనించారని తెలుసుకొని యూటర్న్‌ తీసుకున్నాడన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎంపీలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తనను, తన పార్టీని ఆంధ్రరాష్ట్రం నుంచి తరిమికొడతారనే భయం ఒకవైపు.. మరోవైపు కేసుల భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. 
Back to Top