30 కుటుంబాలు చేరిక

వైయస్ఆర్ జిల్లాః  పెద్దమాదిగపల్లి దళితవాడనుంచి 30 కుటుంబాలు వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎంపీపీ అజంతమ్మ సమక్షంలో వైయస్సార్‌సీపీలో చేరారు. తమ ఊరిలో అనేక సమస్యలు ఉన్నాయని,  వాటిని ప్రభుత్వం పరిష్కరించడం లేదని పార్టీలో చేరిన సందర్భంగా వారు చెప్పారు. వైయస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అందరికీ ఇళ్లు, పింఛన్లు ఇచ్చారని ప్రస్తుత ప్రభుత్వంలో అలా జరగడంలేదని అన్నారు. జగనన్నకు తోడుగా పార్టీ అభివృద్ది కోసం కృషిచేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్‌పీటీసీ హాకింసాబ్, ఎంపీటీసీ శ్రీలత, మధుసూధన్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top