వైయస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో ముగ్గురి నియామకం

మామిడికుదురు: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర బీసీ , ఎస్సీ సెల్‌ విభాగాల్లో పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన ముగ్గురిని నియమించారు. పి.గన్నవరం మండలం మానేపల్లి గ్రామానికి చెందిన పితాని నర్సింహారావును పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగాను, అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారానికి చెందిన మట్టపర్తి మీరాసాహేబ్‌శెట్టిని పార్టీ రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శిగాను, అదే మండలం చిరుతపూడి గ్రామానికి చెందిన నేతల నాగరాజును ఎస్సీ సెల్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగాను నియమించారని పి.గన్నవరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు మంగళవారం తెలిపారు. తమకు రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించిన పార్టీ అధినేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి మిండగుదుటి మోహనరావు, పి.గన్నవరం కో–ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు, మండల శాఖ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వరరావు, వాసంశెట్టి చినబాబులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తమపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని, జగన్‌ ముఖ్యమంత్రి కావడమే తమ లక్ష్యంగా పని చేస్తామన్నారు.

Back to Top