నేటి నుంచి జిల్లాలో మూడ్రోజుల పర్యటన

  • కుటుంబసభ్యులతో కలిసి వైయస్ జగన్ క్రిస్మస్ వేడుకలు
  • ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు
  • పలు ప్రత్యేక కార్యక్రమాలకు హాజరు
వైయస్ఆర్ కడప/పులివెందుల : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ ఉదయాన్నే వెంకటప్ప మోమోరియల్‌ మెయిన్‌బ్రాంచ్‌ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. 9.30కు పులివెందులలోని స్థానిక వీజే ఫంక‌్షన్‌ హాలులో వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు రామట్లపల్లె భాస్కర్‌రెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ నుంచి నేరుగా 10 గంటలకు ఇడుపులపాయకు చేరుకుని అక్కడ కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైయస్ జగన్ తో పాటు వైయస్ విజయమ్మ, వైయస్ భారతి తదితరులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. 

అక్కడ నుంచి 2గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకుని అక్కడ పార్టీ నాయకులు ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో వైయస్ జగన్ పాల్గొంటారు. అనంతరం ప్రొద్దుటూరు నుంచి కడపకు చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదివారం ఉదయం 8.30కు క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకుని పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు వేంపల్లె మండలం అలవలపాడుకు చేరుకుని ఇటీవల ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురైన మండల ఉపాధ్యక్షుడు గజ్జెల రామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 5.30కు కడపకు చేరుకుని కార్పొరేటర్‌ మక్బుల్‌ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి పులివెందులకు చేరుకుంటారు. సోమవారం ఉదయం 9.30కు పీబీసీ రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం చూపుతున్న వివక్షపై పులివెందుల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాలో ఆయన పాల్గొననున్నారు.
 
హైదరాబాద్‌ నుంచి నేరుగా నిన్న పులివెందులకు చేరుకున్న వైయస్‌ జగన్‌కు పార్టీ నేతలు, అభిమానులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, వైయస్‌ఆర్‌సీపీ నేతలు వైయస్‌ భాస్కర్‌రెడ్డి, వైయస్‌ మనోహర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు కలిసి అనేక అంశాలపై చర్చించారు. అనంతరం పులివెందుల మండల పరిశీలకుడు బలరామిరెడ్డి, లింగాల ఎంపీపీ పి.వి.సుబ్బారెడ్డి, వేముల మండల నాయకులు నాగేళ్ల సాంబశివారెడ్డి, మాజీ ఎంపీపీ ఆర్‌.జనార్దన్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మరకా శివకృష్ణారెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ చిన్నప్ప, వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వీరప్రతాప్‌రెడ్డి, కౌన్సిలర్లు కలిసి చర్చించారు.

Back to Top