1, 2, 3 తేదీల్లో 'శంఖారావా'నికి విరామం

చిత్తూరు :

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్న రెండవ విడత సమైక్య శంఖారావం యాత్రకు జనవరి 1 నుంచి 3వ తేదీ వరకు తాత్కాలిక విరామం ప్రకటించారు. పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, చిత్తూరు జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణ స్వామి‌ ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 31, జనవరి 1 తేదీల్లో యాత్రను వాయిదా వేయాలని పార్టీ కార్యకర్తలు, నాయకులు, భద్రతా సిబ్బంది చేసిన అభ్యర్థన మేరకు శ్రీ జగన్ డిసెంబ‌ర్ 31 సాయంత్రమే యాత్రను ముగిస్తున్న‌ట్లు తెలిపారు. మదనపల్లి బహిరంగసభలో ప్రసంగించిన అనంతరం శ్రీ వైయస్ జగ‌న్ హైదరాబా‌ద్‌ వెళతారని, జనవరి 3న కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నందున తిరిగి 4న తంబళ్లపల్లి నియోజకవర్గం బీ కొత్తకోట నుంచి యాత్రను ప్రారంభిస్తారని తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top