ఒక్కో ఎంపీపీకి రూ.3 కోట్లు ఆఫర్

హైదరాబాద్ః  అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోళ్లు చేస్తూ చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైయస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ కు అండగా ఉన్న ఎమ్మెల్యేలను కొనేందుకు చంద్రబాబు విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లడం దుర్మార్గమన్నారు.  తన వైపు చూసేందుకు కూడా సాహసించని చంద్రబాబు మంత్రులను పంపించి...వైయస్సార్సీపీ ఎంపీపీలకు ఆశపెడుతున్నారని ఆర్కే ఫైరయ్యారు.  అన్యాయంగా, అక్రమంగా దోచేసిన సొమ్ముతో ఒక్కో ఎంపీపీకి రూ. 3 కోట్లు ఎరచూపుతున్నారని ధ్వజమెత్తారు. సమయం వచ్చినప్పుడు బాబు బండారం మొత్తం ఆధారాలతో సహా నిరూపిస్తామని ఆర్కే స్పష్టం చేశారు. 

Back to Top